తమ్ముడూ... త్వరగా ఆ కారేసుకుని నా దగ్గరకు రా!: హరీశ్ శంకర్ ఫన్నీ ట్వీట్

  • అనిల్ రావిపూడికి చిరు ఇచ్చిన కారుపై హరీశ్ శంకర్ ట్వీట్
  • ఆ కారులో ఉస్తాద్ భగత్ సింగ్ పాట వింటూ డ్రైవ్ వెళ్దామంటూ సరదా వ్యాఖ్య
  • సంక్రాంతి బ్లాక్‌బస్టర్ ఇచ్చినందుకు అనిల్‌కు చిరంజీవి కారు గిఫ్ట్
  • ఇద్దరు దర్శకుల మధ్య ఫన్నీ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్
'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన నేపథ్యంలో, ఆ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడికి మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన స్పోర్ట్ కారును బహుమతిగా ఇవ్వడం తెలిసిందే. ఈ కారు తన జీవితంలో అమూల్యమైన కానుక అని అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అది కూడా, చిన్నప్పటి నుంచి తాను ఎంతో ఆరాధిస్తున్న వ్యక్తి నుంచి ఈ బహుమతి అందుకోవడం చిరస్మరణీయంగా నిలిచిపోతుందని పేర్కొన్నాడు. 

అనిల్ రావిపూడి ట్వీట్ పై హరీశ్ శంకర్ పైవిధంగా స్పందించాడు. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నఉస్తాద్ భగత్ సింగ్ కొత్త సాంగ్ వింటూ ఆ కారులో షికారు చేద్దామని సరదాగా వ్యాఖ్యానించాడు.

"తమ్ముడూ... త్వరగా ఆ కారేసుకొని నా దగ్గరికి వస్తే... అందులో UBS (ఉస్తాద్ భగత్ సింగ్) కొత్త సాంగ్ వింటూ అలా డ్రైవ్ వేద్దాం... ఇదే నీకు నా గిఫ్ట్!" అంటూ దర్శకుడు హరీశ్ శంకర్ ఫన్నీగా ట్వీట్ చేశాడు. 







More Telugu News