ఆ ఇద్దరి సినిమాల్లోనే ఐటెం సాంగ్స్ చేస్తా: రష్మిక మందన్న

  • ఐటెం సాంగ్స్ కోసం రష్మికకు ఫుల్ డిమాండ్
  • రష్మిక కోసం ప్లాన్ చేసుకుంటున్న దర్శక నిర్మాతలు
  • ఆ ఫేవరేట్ దర్శకుల పేర్లు వెల్లడించని రష్మిక

దక్షిణాది సినిమాల నుంచి బాలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్లు స్పెషల్ సాంగ్స్ (ఐటెం సాంగ్స్)లో మెరవడం ఇప్పుడు ఒక పెద్ద ట్రెండ్‌గా మారింది. సమంత 'పుష్ప' సినిమాలో 'ఊ అంటావా మావా' సాంగ్‌తో సంచలనం సృష్టించగా, తమన్నా కూడా పలు చిత్రాల్లో ఇలాంటి స్పెషల్ నంబర్లతో అభిమానులను అలరించింది. 


ఈ ట్రెండ్‌లో రష్మిక మందన్న కూడా దూసుకుపోతోంది. ఆమె డ్యాన్స్ స్కిల్స్‌తో కుర్రకారును ఆకట్టుకుంటుండటంతో, దర్శక నిర్మాతలు ఆమెను స్పెషల్ సాంగ్స్ కోసం సంప్రదిస్తున్నారు. రష్మికను ఐటెం సాంగ్స్ లోకి తీసుకుంటే గ్లామర్, పెర్ఫార్మెన్స్ రెండూ ఒకేసారి సెట్ అవుతాయని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు.


కానీ, రష్మిక ఇటీవల తన నిర్ణయాన్ని స్పష్టంగా చెప్పి, ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. తాను స్పెషల్ సాంగ్స్ చేసేది కేవలం ఇద్దరు ఫేవరెట్ డైరెక్టర్ల సినిమాల్లో మాత్రమే అని, మిగతా ఎవరికీ అందుబాటులో ఉండబోనని స్పష్టం చేసింది. "ఇతర చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ విషయానికి వస్తే, నాకు ఇద్దరు డైరెక్టర్లు మనసులో ఉన్నారు. వారి పేర్లు చెప్పలేను. వారు అడిగితే చేస్తా, లేకపోతే చేయను" అని రష్మిక ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. 


ఈ ప్రకటనతో టాలీవుడ్, బాలీవుడ్ మేకర్లు అయోమయంలో పడ్డారు. రష్మిక పాన్ ఇండియా క్రేజ్‌ను తమ సినిమాల్లో వాడుకోవాలని ఆశపడ్డవారు ఇప్పుడు నిరాశ చెందుతున్నారు. ఆ ఇద్దరు లక్కీ డైరెక్టర్లు ఎవరనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. రష్మిక స్వయంగా రివీల్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.



More Telugu News