మూడో టీ20: టీమిండియా ముందు ఈజీ టార్గెట్

  • భారత్, న్యూజిలాండ్ మూడో టీ20
  • టీమిండియా ముందు 154 పరుగుల సాధారణ లక్ష్యం
  • మూడు వికెట్లతో చెలరేగిన జస్‌ప్రీత్ బుమ్రా
  • రెండు వికెట్లు పడగొట్టిన రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా
  • కివీస్ తరఫున గ్లెన్ ఫిలిప్స్ (48) టాప్ స్కోరర్
గౌహతి వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు దుమ్మురేపారు. క్రమశిక్షణతో బౌలింగ్ చేసి కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. సిరీస్ కైవసం చేసుకునేందుకు టీమిండియా ముందు 154 పరుగుల సులువైన లక్ష్యం నిలిచింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నమ్మకాన్ని బౌలర్లు నిలబెట్టారు. ఆరంభం నుంచే కివీస్‌ను దెబ్బతీశారు. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 48) ఒంటరి పోరాటం చేశాడు. అతడికి మార్క్ చాప్‌మన్ (32), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (27) నుంచి కొంత సహకారం లభించినా, భారీ స్కోరు మాత్రం చేయలేకపోయారు.

భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణించాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ (2/18), హార్దిక్ పాండ్యా (2/23) కూడా వికెట్లతో సత్తా చాటారు. హర్షిత్ రాణాకు ఒక వికెట్ దక్కింది. భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనతో న్యూజిలాండ్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.




More Telugu News