లక్షలాది స్కూటర్లను వెనక్కి పిలిపించిన యమహా... కారణం ఇదే!
- యమహా ఇండియా భారీ రీకాల్ ప్రకటన
- 3 లక్షలకు పైగా స్కూటర్లు వెనక్కి
- ఫ్రంట్ బ్రేక్ భాగంలో లోపం గుర్తింపు
- రే జెడ్ఆర్, ఫ్యాసినో హైబ్రిడ్ మోడళ్లపై ప్రభావం
- లోపమున్న భాగాన్ని ఉచితంగా మార్చనున్న కంపెనీ
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా ఓ కీలక ప్రకటన చేసింది. తమ పాపులర్ 125 సీసీ స్కూటర్లలో బ్రేక్ భాగానికి సంబంధించిన లోపం కారణంగా 3 లక్షలకు పైగా వాహనాలను స్వచ్ఛందంగా రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్, ఫ్యాసినో 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ మోడళ్లను వెనక్కి పిలుస్తున్నట్లు తెలిపింది.
కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, మొత్తం 3,06,635 స్కూటర్లపై ఈ రీకాల్ ప్రభావం చూపనుంది. 2024 మే 2 నుంచి 2025 సెప్టెంబర్ 3 మధ్య కాలంలో తయారైన వాహనాల్లో ఈ సమస్యను గుర్తించినట్లు యమహా పేర్కొంది. ఈ స్కూటర్లలోని ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లో లోపం ఉన్నట్లు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో దీని పనితీరు మందగించే అవకాశం ఉందని వివరించింది.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందునే ఈ రీకాల్ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. సమస్య ఉన్నట్లు గుర్తించిన వాహనాల యజమానులకు వ్యక్తిగతంగా సమాచారం అందిస్తామని తెలిపింది. వారు తమ సమీపంలోని యమహా ఆథరైజ్డ్ షోరూంను సంప్రదించి, లోపమున్న బ్రేక్ భాగాన్ని ఎలాంటి ఖర్చు లేకుండా ఉచితంగా మార్చుకోవచ్చని సూచించింది.
ఈ రీకాల్ ప్రక్రియ తక్షణమే అమల్లోకి వచ్చినట్లు యమహా ఇండియా తెలిపింది. వినియోగదారుల భద్రతకే తమ మొదటి ప్రాధాన్యత అని, అందుకు కట్టుబడి ఉన్నామని కంపెనీ పునరుద్ఘాటించింది