మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం రూ.3.70 కోట్లు విడుదల

  • నిధులు విడుదల చేసిన పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు
  • కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో నిధులు విడుదల
  • గతంలో రూ.80 కోట్లతో పర్యాటకులకు మౌలిక సదుపాయాలు
మేడారం జాతర నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం శుభవార్తను వెల్లడించింది. సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహణ కోసం నిధులను విడుదల చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా రూ.3.70 కోట్లను విడుదల చేశాయి. కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి చొరవతో ఈ నిధులు విడుదలయ్యాయి.

మేడారం పరిసర ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు గిరిజన సర్క్యూట్ పేరుతో గతంలో రూ.80 కోట్లతో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. అంతేకాకుండా రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రూ.140 కోట్లు ఖర్చు చేస్తోంది.



More Telugu News