పుణేలో తీవ్ర విషాదం... సైకిల్‌పై వెళుతుండగా కారు కింద పడి బాలుడు మృతి

  • పుణేలోని లోనికల్భోర్ ప్రాంతంలోని రెసిడెన్షియల్ హౌసింగ్ సొసైటీలో దుర్ఘటన
  • జాయ్‌నెస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో కారు కిందపడి బాలుడి మృతి
  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
పుణే నగరంలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. లోనికల్భోర్ ప్రాంతంలోని ఓ రెసిడెన్షియల్ హౌసింగ్ సొసైటీ ఆవరణలో వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో ఐదు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. జాయ్‌నెస్ట్ హౌసింగ్ సొసైటీలో ఈ దుర్ఘటన సంభవించింది.

మధ్యాహ్నం బాలుడు తన నివాస సముదాయంలో ఆడుకుంటుండగా, కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు బాలుడిని ఢీకొట్టింది. అనంతరం, కారు నడుపుతున్న వ్యక్తి కిందకి దిగి బాలుడిని పైకి లేపాడు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతి చెందిన బాలుడిని నిష్కర్ష్ అశ్వత్ రెడ్డిగా గుర్తించారు.

ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. బాలుడు పార్కు చేసిన కార్ల మధ్య నుంచి రోడ్డుపైకి వస్తుండగా, అదే మార్గంలో వచ్చిన నీలి రంగు కారు అతడిని ఢీకొట్టినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.


More Telugu News