ఎంత ఎదిగినా నా బిడ్డవే.. లోకేశ్‌కు తల్లి భువనేశ్వరి ఎమోషనల్ బర్త్‌డే విషెస్

  • నేడు మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు 
  • తల్లి నారా భువనేశ్వరి నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు
  • ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేసిన భువనేశ్వరి
  • మంత్రిగా లోకేశ్ పనితీరు సంతోషాన్నిస్తోందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్ ఇవాళ‌ తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ రంగాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తనయుడి పుట్టినరోజున తల్లి నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ప్రేమపూర్వక సందేశం అందరినీ ఆకట్టుకుంటోంది.

'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా లోకేశ్‌కు భువనేశ్వరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "కొడుకు ఎంత ఎదిగినా తల్లికి మాత్రం బిడ్డగానే కనిపిస్తాడు అంటారు. లోకేశ్‌ను చూస్తున్నప్పుడు కూడా నిన్న మొన్నటి వరకు నా చేతుల్లో ఆడుకున్న పిల్లాడేనా అనిపిస్తుంది. ఆ పిల్లాడే ఇప్పుడు మంత్రిగా బాగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. నాన్నా లోకేశ్... నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను నువ్వు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను" అని భువనేశ్వరి తన పోస్టులో పేర్కొన్నారు. తల్లిగా తన కుమారుడి ఎదుగుదలను చూసి భువనేశ్వరి పడుతున్న ఆనందం ఈ పోస్టులో స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


More Telugu News