ఆకాశమే హద్దుగా పసిడి పరుగు: రూ. 1.60 లక్షల దిశగా బంగారం!

     
బులియన్ మార్కెట్‌లో ధరల పెరుగుదల కొనసాగుతోంది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గురువారం పసిడి, వెండి ధరలు మరోసారి భారీగా పుంజుకున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్సు బంగారం ధర 4900 డాలర్ల మైలురాయిని దాటగా, వెండి కూడా 96 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.

ఈ ప్రభావం నేరుగా స్థానిక మార్కెట్లపై పడింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గురువారం అర్థరాత్రి సమయానికి 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ. 1,59,000కు చేరుకుంది. వెండి కూడా అదే బాటలో పయనిస్తూ కిలో ధర రూ. 3,26,000 వద్ద స్థిరపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ విలువలో మార్పుల కారణంగా రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


More Telugu News