సూరారంలో బాలుడిపై దాడి చేసిన శునకం.. వీడియో ఇదిగో!

  • వీధి కుక్క దాడిలో గాయపడ్డ ఐదేళ్ల బాలుడు
  • హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన తల్లిదండ్రులు
  • సమాచారం అందించినా అధికారులు స్పందించలేదంటున్న స్థానికులు
హైదరాబాద్ లోని సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వీధిలో ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడిపై శునకం దాడి చేసింది. రోడ్డుపై వెళుతూ ఉన్నట్టుండి బాలుడిపై దాడి చేసి గాయపరిచింది. దీంతో బాలుడి ముఖంపై గాయాలయ్యాయి. సమీపంలో ఉన్న పెద్దవాళ్లు అరవడంతో బాలుడిని వదిలేసి కుక్క పారిపోయింది. వీధిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో ఈ సంఘటన రికార్డయింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, వీధి కుక్క దాడిలో గాయపడిన బాలుడిని తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనకు సంబంధించి సమాచారం అందించినా గాజుల రామారం సర్కిల్ అధికారులు స్పందించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News