గాజా కోసం ట్రంప్ 'శాంతి మండలి'.. చేరడానికి అంగీకరించిన ఇజ్రాయెల్

  • గాజా పునర్నిర్మాణం కోసమంటూ మండలిని ఏర్పాటు చేసిన ట్రంప్
  • మండలి కూర్పు సరిగా లేదని చేరడానికి తొలుత నిరాకరించిన ఇజ్రాయెల్
  • తాజాగా ట్రంప్ ఆహ్వానం మేరకు చేరుతున్నట్లు వెల్లడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన 'శాంతి మండలి'లో చేరేందుకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజామిన్ నెతన్యాహూ అంగీకరించారు. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ఈ మండలిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మండలిలో తాము చేరుతున్నామని నెతన్యాహూ పేర్కొన్నారు.

మండలి కూర్పు సరిగా లేదని చెబుతూ తొలుత ఇజ్రాయెల్ ఇందులో చేరడానికి నిరాకరించింది. తాజాగా ట్రంప్ ఆహ్వానం మేరకు మండలిలో చేరుతున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

గాజాలో శాంతిని నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన ఈ మండలికి ట్రంప్ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మండలిలో చేరడానికి భారత్‌తో సహా అనేక దేశాలకు ఆహ్వానం అందింది. యూఏఈ, మొరాకో, వియత్నాం వంటి దేశాలు మండలిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశాయి. యూకే, రష్యా, యూరోపియన్ యూనియన్ దేశాలు స్పందించాల్సి ఉంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇందులో చేరడానికి నిరాకరించారు.


More Telugu News