దావోస్ సదస్సు వేదికపై సన్‌గ్లాసెస్‌తో ఆకట్టుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్

  • మాక్రాన్ ఏదైనా సందేశం ఇస్తున్నారా, లేక ఫ్యాషనా అనే చర్చ
  • కళ్లద్దాలు పెట్టినందుకు క్షమించాలని చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టిన మాక్రాన్
  • తనకు చిన్నపాటి కంటి సమస్య ఉందన్న మాక్రాన్
దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిక లోపల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సన్‌గ్లాసెస్ ధరించడం చర్చనీయాంశమైంది. మాక్రాన్ సన్‌గ్లాసెస్ పెట్టుకోవడం ద్వారా డొనాల్డ్ ట్రంప్‌నకు ఏదైనా సందేశం ఇస్తున్నారా? లేక ఇది కేవలం ఫ్యాషనా? అనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ చర్చకు మాక్రాన్ స్వయంగా తెరదించారు. తనకు చిన్నపాటి కంటి సమస్య ఉందని, అందుకే కళ్లద్దాలు పెట్టుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

ఇదివరకు ఫ్రాన్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కూడా ఆయన కన్ను ఎర్రగా వాచి కనిపించింది. ఆ సమయంలో కూడా ఆయన కొంతసేపు కళ్లద్దాలు ధరించారు.

దావోస్ వేదికగా గ్రీన్‌లాండ్ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మాక్రాన్ కౌంటర్ ఇచ్చారు. సామ్రాజ్యవాదం మళ్లీ పురుడు పోసుకుంటోందని విమర్శించారు. 


More Telugu News