గుడ్ న్యూస్ చెప్పిన జేడీ వాన్స్ దంపతులు

  • నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఉషా వాన్స్
  • 2014లో పెళ్లి చేసుకున్న జేడీ వాన్స్, ఉష
  • వీరికి ప్రస్తుతం ముగ్గురు పిల్లలు

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌, భార్య ఉషా వాన్స్‌ దంపతులు శుభవార్తను పంచుకున్నారు. త్వరలోనే తమ కుటుంబంలోకి నాలుగో బిడ్డ రాబోతున్నట్టు వారు ప్రకటించారు. ఉష నాలుగో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. జులై చివరి నాటికి పండంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నాడని తెలిపారు. 


జేడీ వాన్స్‌, ఉషా వాన్స్‌ దంపతులు 2014లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఈవాన్‌, వివేక్‌, మిరాబెల్‌ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే వారి అభిమానులు, మద్దతుదారులు, సన్నిహితులు సోషల్‌ మీడియా వేదికగా వాన్స్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.



More Telugu News