ఓటరు జాబితా సవరణ.. విచారణకు హాజరైన క్రికెటర్ షమీ

  • ఎస్ఐఆర్ లో భాగంగా పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేసిన ఈసీ అధికారులు
  • కోల్‌కతా బిక్రంగఢ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఈసీ అధికారుల ముందు హాజరై అవసరమైన పత్రాలను అందజేసిన షమీ
  • ఎస్‌ఐఆర్ దరఖాస్తులో షమీ ఇచ్చిన వివరాల్లో కొన్ని వ్యత్యాసాలు గుర్తించడంతో విచారణకు నోటీసులు ఇచ్చామన్న ఎన్నికల అధికారి
భారత క్రికెటర్ మహ్మద్ షమీ ఎన్నికల అధికారుల ఎదుట హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా పలువురు ప్రముఖులకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న మహ్మద్ షమీ నిన్న కోల్‌కతాలోని బిక్రంగఢ్ ప్రాంతంలో గల ఒక పాఠశాలలో ఎన్నికల సంఘం అధికారుల ముందు హాజరై అవసరమైన పత్రాలను సమర్పించారు.

ఎస్ఐఆర్ దరఖాస్తులో షమీ సమర్పించిన వివరాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామని, అందువల్ల విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశామని ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు తెలిపారు. ఇదివరకే ఒకసారి నోటీసులు జారీ చేసినప్పటికీ, క్రికెట్ మ్యాచ్ కారణంగా ఆయన హాజరుకాలేకపోయారని, అందువలన మరొక అవకాశం కల్పించినట్లు వారు వెల్లడించారు.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మహ్మద్ షమీ క్రికెట్ వృత్తిరీత్యా కోల్‌కతాలో నివాసం ఏర్పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని 93వ వార్డులో ఓటరుగా నమోదు చేసుకున్నారని, ఆ వార్డు రాస్‌బిహారీ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలియజేశారు. 


More Telugu News