ఏనుగును దత్తత తీసుకున్న తమిళ హీరో
- వండలూర్ జూ పార్క్‌లో ఉన్న ఓ ఏనుగును దత్తత తీసుకున్న శివ కార్తికేయన్
- ఏనుగు సంరక్షణ బాధ్యతలను శివ కార్తికేయన్ స్వయంగా పర్యవేక్షించనున్నారన్న జూ పార్క్ అధికారులు
- సోషల్ మీడియాలో అభిమానుల ప్రశంసలు
తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వండలూర్ జూ పార్క్‌లోని ఓ ఏనుగును ఆయన దత్తత తీసుకున్నారు. ప్రకృతి అనే పేరు గల ఆ ఏనుగు సంరక్షణ బాధ్యతలను ఆరు నెలల పాటు శివ కార్తికేయన్ స్వయంగా పర్యవేక్షించనున్నారు. ఈ విషయాన్ని జూ పార్క్ అధికారులు అధికారికంగా ప్రకటించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. హీరో చేసిన ఈ మంచి పనికి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక శివ కార్తికేయన్ సినిమాల విషయానికి వస్తే, ఆయన నటించిన 'పరాశక్తి' చిత్రం పొంగల్ కానుకగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 10న థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాను రాజకీయాలతో ముడిపెట్టడంతో కొంత వివాదానికి దారితీసింది. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది.