Donald Trump: దావోస్‌లో ట్రంప్ విందు.. భారత కంపెనీల సీఈవోలకు ఆహ్వానం

Donald Trump Hosts Dinner for Indian CEOs at Davos
  • దావోస్ ఆర్థిక సదస్సుకు తరలి వస్తున్న దేశాధినేతల, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు
  • ఆరేళ్ల తర్వాత ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్న ట్రంప్
  • ట్రంప్ విందులో పాల్గొననున్న చంద్రశేఖరన్, సునీల్ మిట్టల్, సలీల్ పరేఖ్
దావోస్ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేయనున్న ప్రత్యేక విందుకు ఏడుగురు భారతీయ సీఈఓలకు ఆహ్వానం అందినట్లు సమాచారం. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వివిధ దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు తరలి వస్తున్నారు. ఆరేళ్ల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ సదస్సులో పాల్గొననుండటం విశేషం. ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొనడం ఇది మూడోసారి.

ట్రంప్ ఏర్పాటు చేయనున్న ఈ విందుకు టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, భారతీ ఎంటర్‌ప్రైజెస్ ఛైర్మన్ సునీల్ మిట్టల్, విప్రో సీఈఓ శ్రీని పల్లియా, ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్, బజాజ్ ఫిన్ సర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్, మహీంద్రా గ్రూపు సీఈఓ అనీశ్ షా, జుబిలెంట్ భర్తియా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు హరి భర్తియాలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక సదస్సుకు 130 దేశాల నుంచి 3 వేలకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు.
Donald Trump
Davos
World Economic Forum
Indian CEOs
Natarajan Chandrasekaran
Sunil Mittal

More Telugu News