అది సిట్ కాదు.. పిచ్చి విచారణ: కేటీఆర్
- హరీశ్ రావు సిట్ విచారణపై కేటీఆర్ ఆగ్రహం
- అది సిట్ విచారణ కాదు, పిచ్చి విచారణ అని వ్యాఖ్య
- సింగరేణి టెండర్ల స్కాంలో సీఎం బావమరిది సూత్రధారి అని ఆరోపణ
- సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్
తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ విచారించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది సిట్ విచారణ కాదని, పిచ్చి విచారణ అని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. న్యాయం కోసం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకైనా వెళతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతోందని ఆరోపించారు. సింగరేణి టెండర్ల కుంభకోణంలో అసలు సూత్రధారి ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డేనని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.