రేణు దేశాయ్ కి మద్దతుగా యూట్యూబర్ అన్వేష్

  • వీధి కుక్కలను చంపుతున్న ఘటనలపై రేణు దేశాయ్ సీరియస్
  • అధికార, న్యాయ వ్యవస్థలపై ఘాటు విమర్శలు
  • అవినీతి గురించి రేణు దేశాయ్ ధైర్యంగా మాట్లాడారన్న అన్వేష్

సినీ నటి రేణు దేశాయ్ ఇటీవల వీధి కుక్కలను చంపుతున్న ఘటనలపై స్పందించిన తీరు పెద్ద చర్చకు దారి తీసింది. ఈ సందర్భంగా ఆమె రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు, జీహెచ్‌ఎంసీ వ్యవస్థ మొత్తం అవినీతితో నిండిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, న్యాయవ్యవస్థపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రేణు దేశాయ్ మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ కావడంతో అనేక వర్గాల నుంచి స్పందనలు వస్తున్నాయి.


ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ కి యూట్యూబర్ అన్వేష్ మద్దతుగా నిలిచారు. 2026కి ఇదే బెస్ట్ స్పీచ్ అంటూ రేణు దేశాయ్‌ను ప్రశంసించారు. దేశంలో అవినీతి గురించి భయపడకుండా మాట్లాడినందుకు ఆమెకు కితాబునిచ్చారు. మరాఠీ అమ్మాయిగా పుట్టిన రేణుపై శివాజీ మహరాజ్ ఆత్మ పూనినట్టే ఆమె ధైర్యంగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. ఒక్క అంశానికే పరిమితం కాకుండా వ్యవస్థలోని అన్ని లోపాలను ఆమె టచ్ చేశారన్నారు.


ప్రపంచంలో చాలా దేశాల్లో రెండు పార్టీలే ఉంటాయని, కానీ భారత్‌లో 4,500కు పైగా పార్టీలు ఉండటం వల్లే అవినీతి పెరిగిందని అన్వేష్ అన్నారు. ఇంతమంది రాజకీయాల మీద ఆధారపడి జీవిస్తున్నప్పుడు అవినీతి లేకుండా ఉండడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ముందుగా పార్టీల సంఖ్య తగ్గితేనే వ్యవస్థలో మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.



More Telugu News