బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కాన్వాయ్‌లోని కారుకు యాక్సిడెంట్.. తప్పిన పెను ప్రమాదం

  • ముంబైలో అక్షయ్ కుమార్ సెక్యూరిటీ కారుకు ప్రమాదం
  • ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలు
  • ప్రమాద సమయంలో కారులో అక్షయ్ లేరన్న పోలీసులు
  • జుహూ ప్రాంతంలో కారును ఢీకొన్న ట్రక్కు 
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న కారు ముంబైలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. అయితే, ప్రమాద సమయంలో కారులో అక్షయ్ కుమార్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ లేరని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ముంబై పోలీసుల కథనం ప్రకారం నగరంలోని జుహూ ప్రాంతంలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అక్షయ్ కుమార్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కోసం వినియోగించే కారును ఎదురుగా వస్తున్న ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడగా, వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరైన అక్షయ్ కుమార్‌కు ఆయనకున్న పాపులారిటీ, రాజకీయ ప్రముఖులతో పరిచయాల వల్ల గతంలో కొన్ని బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయనకు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భద్రతతో పాటు, ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా నిరంతరం ఆయన వెంటే ఉంటారు. బహిరంగ కార్యక్రమాల్లో ఆయన కాన్వాయ్‌తోనే ప్రయాణిస్తుంటారు.


More Telugu News