మహిళతో రాసలీలలు... తీవ్ర వివాదంలో కర్ణాటక డీసీఆర్ఈ డీజీపీ రామచంద్రరావు
- డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావు రాసలీలల వీడియోలు వైరల్
- ఆఫీసులోనే మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు
- అవి మార్ఫింగ్ వీడియోలని ఖండించిన డీజీపీ
- ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించిన సీఎం సిద్దరామయ్య
- గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ డీజీపీపై ఆరోపణలు
కర్ణాటకలో డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఓ మహిళతో రాసలీలల వీడియోలు పెను దుమారం రేపుతున్నాయి. తన కార్యాలయంలోనే ఓ మహిళతో అభ్యంతరకర రీతిలో ప్రవర్తించినట్లు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ ఆరోపణలను రామచంద్రరావు ఖండించారు. అవన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోలని స్పష్టం చేశారు.
గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ రామచంద్రరావుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన నటి రన్యా రావుకు ఈయన సవతి తండ్రి. ఈ కేసు నేపథ్యంలో 2025 మార్చిలో ప్రభుత్వం ఆయన్ను నిర్బంధ సెలవుపై పంపించి, ఇటీవలే తిరిగి విధుల్లోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (DCRE) డీజీపీగా పనిచేస్తున్నారు. కాగా, ఈ వీడియోల వ్యవహారంపై న్యాయవాదిని సంప్రదించి తదుపరి చర్యలు తీసుకుంటానని రామచంద్రరావు మీడియాకు తెలిపారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోల్లో డీసీఆర్ఈ డీజీపీ రామచంద్రరావు యూనిఫాంలో ఉండగానే తన అధికారిక ఛాంబర్‌లో ఓ మహిళతో సన్నిహితంగా, అశ్లీల ప్రవర్తనతో కూడిన దృశ్యాలు ఉన్నాయి. ఒక క్లిప్‌లో ఆయన మహిళను ముద్దుపెట్టుకుంటుండగా, మరో వీడియోలో సూట్‌లో ఉండగా భారత జాతీయ పతాకం, పోలీసు శాఖ చిహ్నం ముందు ఇలాంటి ప్రవర్తనే కనబరిచారు. ఈ వీడియోల్లో మహిళ ముఖాన్ని బ్లర్ చేసి, నేపథ్య సంగీతం జోడించి సర్క్యులేట్ చేశారు.
ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు రామచంద్రరావు సోమవారం హోంమంత్రి జి. పరమేశ్వర కార్యాలయానికి వెళ్లారు. అయితే, ఆయనతో భేటీకి మంత్రి నిరాకరించినట్లు సమాచారం. ఈ పరిణామంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని, ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని హోం శాఖను ఆదేశించారని తెలిసింది.
ఈ వీడియోలను ఏడాది క్రితమే చిత్రీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, వీటిని ఇప్పుడు ఎందుకు విడుదల చేశారనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై మాజీ హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర స్పందిస్తూ.. సీనియర్ అధికారి ఈ స్థాయికి దిగజారడం సిగ్గుచేటని, ఆయన పోలీసు శాఖను అవమానించారని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.