బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక

  • రేపు ఉదయం పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నబీన్
  • జేపీ నడ్డా పదవీ కాలం ముగియడంతో అనివార్యమైన ఎన్నిక
  • గత ఏడాది డిసెంబర్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితిన్ నబీన్ ప్రస్తుతం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఈ ఎన్నిక జరిగింది.

నితిన్ నబీన్ (46) బీహార్ రాష్ట్రానికి చెందినవారు. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గత ఏడాది డిసెంబర్‌లో బీజేపీ ప్రకటించింది. ఆయనను పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు అప్పుడే వార్తలు వెలువడ్డాయి. నబీన్‌కు ఆరెస్సెస్ నేపథ్యం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బాంకీపూర్ నుంచి నబిన్ నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


More Telugu News