అమెరికాలో తప్పిన ప్రమాదం... విమానం ల్యాండ్ అవుతుండగా ఊడిన టైరు
- చికాగో నుంచి బయలుదేరి ఓర్లాండో విమానాశ్రయంలో దిగుతుండగా ఘటన
- సాంకేతిక లోపం కారణంగా ఊడిన టైరు
- పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో తప్పిన ప్రమాదం
అమెరికాలో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ల్యాండ్ అవుతుండగా టైరు ఊడిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. చికాగోలోని ఓహెర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం ఓర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టైరు ఊడిపోయింది.
ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో సిబ్బంది, ప్రయాణికులతో కలిపి 206 మంది ఉన్నారు. సాంకేతిక సమస్య కారణంగా విమానం టైరు ఊడిపడిన సమయంలో పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను విమానం నుంచి సురక్షితంగా దించామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పేర్కొన్నారు. విమానాన్ని రన్ వే నుంచి తొలగించడానికి సిబ్బంది చర్యలు చేపట్టారు.