మూడో వన్డేలో టాస్ నెగ్గిన భారత్... ఎవరు గెలిస్తే వాళ్లదే సిరీస్!

  • సిరీస్ నెగ్గాలంటే భారత్ ఈ మ్యాచ్ గెలవాల్సిందే
  • జ‌ట్టులో కీల‌క మార్పులు చేసిన టీమిండియా
  • ప్ర‌సిద్ద్ కృష్ణ స్థానంలో అర్ష్‌దీప్ కు చోటు
న్యూజిలాండ్‌ తో వన్డే సిరీస్ లో కీలకమైన మూడో వన్డేలో భారత జట్టు టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఇరుజట్లకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ సొంతం కానుండడంతో టీమిండియా మేనేజ్ మెంట్ జట్టులో కీలక మార్పులు చేసింది. తొలి రెండు మ్యాచ్ లలో బెంచ్ కే పరిమితమైన లెఫ్ట్ ఆర్మ్ పేస‌ర్ అర్ష్‌ దీప్ సింగ్‌ ను ఈ మ్యాచ్ లో ఆడిస్తోంది.

ప్ర‌సిద్ధ్ కృష్ణను పక్కన పెట్టి అర్ష్ దీప్ సింగ్ ను తుది జట్టులోకి తీసుకుంది. రెండో వన్డేలో ఓటమి నేపథ్యంలో అర్ష్ దీప్ ను ఆడించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ త‌న మన‌సు మార్చుకున్న‌ట్లు సమాచారం.

భారత్‌ తుది జట్టు.. 
రోహిత్‌ శర్మ, గిల్‌, కోహ్లీ, శ్రేయస్‌, కేఎల్‌ రాహుల్‌, జడేజా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, కుల్‌దీప్‌, అర్ష్‌దీప్‌, సిరాజ్‌.

ఈ సిరీస్ లో తొలి వన్డేలో టీమిండియా నెగ్గగా, రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ విజయం సాధించింది. దాంతో నేటి మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారింది.


More Telugu News