మేడారం జాతర స్పెషల్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం

  • బస్సు చార్జీలను ఖరారు చేసిన ఆర్టీసీ
  • హైదరాబాద్ నుంచి రూ.600 - రూ.1,110
  • వరంగల్‍, హనుమకొండ నుంచి రూ.250 నుంచి రూ.500
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. జాతర సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ సర్వీసులు నడపనున్న విషయం తెలిసిందే. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శనివారం జాతర స్పెషల్ బస్సులకు టికెట్ ధరలను ఖరారు చేస్తూ ఆర్టీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. వరంగల్‍, హనుమకొండ, హైదరాబాద్‍ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.

వరంగల్, హనుమకొండ నుంచి భక్తులు ఎక్కువ సంఖ్యలో మేడారం జాతరకు వస్తారని అంచనా వేసిన అధికారులు.. అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు నడపాలని నిర్ణయించారు. వరంగల్, హనుమకొండ నుంచి మేడారానికి టికెట్ ధర బస్సుల ఆధారంగా రూ.250 నుంచి రూ.500, హైదరాబాద్‍ నుంచి రూ.600 నుంచి రూ. 1,110 వరకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ‘మహాలక్ష్మి’ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు.


More Telugu News