ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన మంత్రి నారా లోకేశ్.. ఫొటోలు ఇవిగో!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరంలో ఉన్న ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్, తాత సమాధిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
అలాగే సినీ నటుడు నందమూరి కల్యాణ్ రామ్, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్టీఆర్‌ను స్మరించుకున్నారు. వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘాట్‌ను అందంగా పూలతో అలంకరించారు. ఎన్టీఆర్ సినీ, రాజకీయ జీవిత విశేషాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు.
అంతకుముందు లోకేశ్ 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ భావోద్వేగ నివాళి అర్పించారు. "తెలుగు జాతి ఆత్మగౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లలో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజించడం ఎన్టీఆర్‌కు మాత్రమే దక్కిన వరం. మీరు భౌతికంగా దూరమైనా, తెలుగువారి హృదయాల్లో సజీవంగా ఉన్నారు," అని పేర్కొన్నారు.