రూ.1.50 లక్షల మార్కు దిశగా పసిడి పరుగులు

  • రోజురోజుకు పెరుగుతున్న పసిడి ధరలు
  • రూ.3,320 పెరిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,050 పెరిగిన వైనం
బంగారం ధరలు గత వారం రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతూ పరుగులు పెడుతున్నాయి. పసిడి రేట్లు రూ.1.50 లక్షల మార్కును తాకేందుకు సిద్ధమవుతున్నట్లుగా దూసుకెళ్తున్నాయి. జనవరి 11న రూ.1,40,460గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, తాజాగా రూ.1,43,780కి చేరింది. వారం రోజుల్లోనే పసిడి ధరల్లో వచ్చిన మార్పు గణనీయంగా కనిపిస్తోంది.

హైదరాబాద్, విజయవాడతో పాటు బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇదే ధోరణి కొనసాగుతోంది. ఈ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వారం రోజుల్లో రూ.3,320 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,750 నుంచి రూ.1,31,800కు చేరి రూ.3,050 పెరిగింది.

చెన్నైలో పసిడి ధరలు మరింత వేగంగా పెరిగాయి. జనవరి 11న రూ.1,39,650గా ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 17వ తేదీకి రూ.1,44,870కు చేరి ఏకంగా రూ.5,220 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,29,000 నుంచి రూ.1,32,800కు చేరి రూ.3,800 పెరుగుదల నమోదు చేసింది.

దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వారం రోజుల్లో రూ.1,40,610 నుంచి రూ.1,43,930కు చేరి రూ.3,320 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.1,28,900 నుంచి రూ.1,31,950కు చేరి రూ.3,050 పెరిగింది. 


More Telugu News