'మన శంకర వరప్రసాద్ గారు' నాలుగు రోజుల కలెక్షన్లు ఇవిగో!

  • సంక్రాంతికి మరో హిట్ కొట్టిన మెగాస్టార్
  • అద్భుత విజయం దిశగా 'మన శంకర వరప్రసాద్ గారు'
  • నాలుగు రోజుల్లో రూ. 190 కోట్ల గ్రాస్ కలెక్షన్లు

మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ అద్భుతమైన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమాతో చిరంజీవి తన స్టార్‌డమ్‌కు తగ్గ మరో బిగ్ హిట్ కొట్టారు. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 190 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటడం విశేషం. 


అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్–కామెడీ ఎంటర్‌టైనర్‌లో నయనతార కథానాయిక కాగా... విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించారు. కథ, వినోదం, భావోద్వేగాలు అన్నీ సమపాళ్లలో కలగలిసిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు రావడంతో కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ రోజు ముగిసేలోపే రూ.200 కోట్ల మార్క్‌ను కూడా ఈ చిత్రం అందుకుంటుందని అంచనాలు వెలువడుతున్నాయి. సంక్రాంతి సెలవుల్లో కుటుంబ ప్రేక్షకులు కూడా పెద్ద సంఖ్యలో థియేటర్లకు తరలివస్తుండటం సినిమాకు అదనపు బలంగా మారింది.



More Telugu News