బైక్ రేసింగ్ చేస్తూ వ్యక్తిని ఢీకొన్న రేసర్లు... చితకబాదిన గ్రామస్థులు

  • హిందూపురం సమీపంలో యువకుల రేసింగ్
  • వ్యక్తిని ఢీకొట్టి ఆయనదే తప్పు అంటూ గొడవ
  • రేసర్లను పట్టుకుని చితకబాదిన గ్రామస్థులు 
కొంత మంది యువతకు రేసింగ్ లు వ్యసనంగా మారుతున్నాయి. పోలీసుల హెచ్చరికలను సైతం లెక్కచేయకుండా వీరు రేసింగ్ లకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీ సత్యసాయి జిల్లా హిందూపురం సమీపంలో ఉన్న కొల్లకుంట వద్ద కొందరు యువకులు రేసింగ్ చేస్తూ ఒక వ్యక్తిని ఢీకొట్టారు. అంతేకాకుండా, ఆ వ్యక్తిదే తప్పు అన్నట్టుగా గొడవపెట్టుకున్నారు.

 అక్కడకు చేరుకున్న గ్రామస్థులు యువకులను ప్రశ్నించడంతో... వారిపై కూడా దాడికి దిగారు. దీంతో, వారిని పట్టుకుని గ్రామస్థులు చితకబాదారు. వారిని అక్కడి నుంచి కదలకుండా బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరోవైపు, ఇప్పటివరకు నగరాలకే పరిమితం అయిన రేసింగ్ లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకుతుండటం ఆందోళన కలిగించే అంశమే.


More Telugu News