అందరికీ అన్నీ తినే అదృష్టం ఉండదు: చిరంజీవి

  • బ్లాక్ బస్టర్ దిశగా 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా
  • చిరంజీవి, వెంకటేశ్, అనిల్ రావిపూడి, సాహు, సుష్మితలతో చిత్ర యూనిట్ స్పెషల్ ఇంటర్వ్యూ
  • తన చేతులతో వండిన వంటకాలను వడ్డించిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' సూపర్ హిట్ అయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటించగా, విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రను పోషించారు. సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతున్న తరుణంలో చిత్ర యూనిట్ ఓ ఇంటర్వ్యూ చేసింది. 

ఈ ఇంటర్య్వూలో చిరంజీవి, వెంకటేశ్, అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు, సుస్మిత పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ ఎంతో సరదాగా సాగింది. ఇంటర్వ్యూ కొనసాగుతున్న సమయంలో ఓ సందర్భంలో చిరంజీవి తన చేతులతో వండిన కొన్ని వంటకాలను అందరికీ వడ్డించారు. ఈ సందర్భంగా చిరంజీవిని కూడా తినాలని వెంకటేశ్ కోరగా... ఆయన తిననని చెప్పారు. దీంతో.. డైట్ చేస్తున్నావని, సన్నగా అయిపోయి సినిమాలో తనను డామినేట్ చేశావని సరదాగా వెంకీ వ్యాఖ్యానించారు. దీనికి సమాధానంగా... పొట్టకూటి కోసం పొట్ట మాడ్చుకుంటున్నానని చిరు చమత్కరించారు. అందరికీ అన్నీ తినే అదృష్టం ఉండదని చెప్పారు. దీంతో, అక్కడ నవ్వులు విరబూశాయి.


More Telugu News