గుడ్ న్యూస్.. సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ బోగీల పెంపు
- 16 నుంచి 20కి పెరిగిన బోగీల సంఖ్య
- ప్రస్తుత సీట్ల సామర్థ్యం 1,440
- ఆరెంజ్ రంగులోకి మారిన బోగీలు
సికింద్రాబాద్-తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉంటోంది. దీంతో ఈ రైలు బోగీల సంఖ్యను పెంచారు.
2023 ఏప్రిల్ 9న ఈ సర్వీసును ప్రారంభించారు. ప్రారంభంలో కొన్ని నెలల పాటు 8 బోగీలతో ఈ రైలు నడిచింది. ప్రయాణికుల నుంచి ఆదరణ ఉండటంతో ఆ తర్వాత 16 బోగీలకు పెంచారు. తాజాగా డిమాండ్ మరింత పెరగడంతో బోగీల సంఖ్యను 20కి పెంచేశారు. ఈ రైలు సామర్థ్యం 1,440 సీట్లుగా ఉంది. మరోవైపు, ఈ రైలు బోగీలను పూర్తిగా ఆరెంజ్ కలర్ లోకి మార్చారు. గతంలో తెలుపు రంగులో ఉన్న ఈ రైలు ఇప్పుడు ఆరెంజ్ కలర్ లోకి మారిపోయింది.