హైదరాబాద్-విజయవాడ రహదారిలో 5 రోజుల్లో ఎన్ని లక్షల వాహనాలు ప్రయాణించాయంటే..!
- ఇరువైపుల కలిసి ఐదు రోజుల్లో 3 లక్షలకు పైగా వాహనాల ప్రయాణం
- శనివారం ఒక్కరోజే అత్యధికంగా 71,284 వాహనాల ప్రయాణం
- హైదరాబాద్ నుంచి విజయవాడ దారిలో 2.04 లక్షల వాహనాల ప్రయాణం
సంక్రాంతి పర్వదినం సందర్భంగా హైదరాబాద్ నగరం దాదాపుగా నిర్మానుష్యంగా మారింది. నగరంలోని రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. భాగ్యనగరవాసులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు సైతం సంక్రాంతి పండుగను జరుపుకునేందుకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి మీదుగా వేలాది వాహనాల్లో తరలివెళ్లారు. ఈ క్రమంలో గత ఐదు రోజుల్లో ఈ రహదారిపై మూడు లక్షలకు పైగా వాహనాలు ప్రయాణించాయని పోలీసులు అంచనా వేస్తున్నారు.
శనివారం ఒక్కరోజే అత్యధికంగా 71,284 వాహనాలు ప్రయాణించగా, శుక్రవారం 53 వేలు, ఆదివారం 62 వేలు, సోమవారం 56 వేలు, మంగళవారం 62 వేల వాహనాలు ఈ రహదారిపై ప్రయాణించాయని అధికారులు తెలిపారు. పంతంగి టోల్ గేటు వద్ద ఐదు రోజుల్లో ఇరువైపుల కలిపి 3.04 లక్షల వాహనాలు రాకపోకలు సాగించాయి. వీటిలో హైదరాబాద్ నుండి విజయవాడ వైపుగా 2.04 లక్షల వాహనాలు ప్రయాణించాయని వెల్లడించారు.
గత సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో ఈ టోల్ గేట్ మీదుగా 2.07 లక్షల వాహనాలు ప్రయాణించాయి. ఈసారి కూడా అదే స్థాయిలో వాహనాలు రాకపోకలు ఉంటాయని భావించినప్పటికీ, అండర్‌పాస్ వంతెనల నిర్మాణ పనుల కారణంగా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.