హిందువులకు రక్షణ లేదు: బంగ్లాదేశ్ ఈసీని కలిసిన ఆ దేశ హిందూ సంఘం
- ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌లో ఎన్నికలు
- ఎన్నికల సంఘంతో సమావేశమైన హిందూ సంఘం
- హిందూ ఓటర్లకు అదనపు రక్షణ, ప్రత్యేక పోలింగ్ బూత్‌లు కావాలని విజ్ఞప్తి
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో, ఆ దేశంలోని ప్రముఖ హిందూ సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో, హిందూ సంఘం బంగ్లాదేశ్ ఎన్నికల సంఘంతో సమావేశమైంది. హిందూ ఓటర్లకు ఎన్నికల సంఘం అదనపు రక్షణ కల్పించాలని ఈసీని కోరింది.
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల్లో తమకు రక్షణ కరవైందని, ముఖ్యంగా మైనారిటీలపై దాడులు జరుగుతున్న ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పేర్కొంది. సురక్షితమైన ఓటింగ్ కోసం తమకు ప్రత్యేక పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసింది.
బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడి మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో పలువురు హిందువులు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు.