కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న యువతిపై గ్యాంగ్ రేప్
- ఆరు రోజుల క్రితం జరిగిన ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి
- కొన్ని గంటల పాటు కదులుతున్న కారులో అత్యాచారం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
రాజస్థాన్‌లో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. బికనీర్ జిల్లాలో కళాశాలకు వెళుతున్న యువతిని అడ్డగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆరు రోజుల క్రితం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జనవరి 6న యువతి కళాశాలకు వెళుతుండగా ఇద్దరు యువకులు ఆమెను అడ్డగించి బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం, కదులుతున్న కారులో ఆమెపై కొన్ని గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో కారు ఒక గ్రామంలోనికి ప్రవేశించగా, స్థానికులకు అనుమానం వచ్చి కారును ఆపి తనిఖీ చేశారు. దాంతో, యువతిని కారులో నుంచి తోసేసి యువకులు అక్కడి నుంచి పరారయ్యారు.
గ్రామస్థులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించి, ఆమె కుటుంబానికి సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.