అమరావతిలో జోరుగా రెండో విడత ల్యాండ్ పూలింగ్.. కర్లపూడిలో ప్రారంభం

  • కర్లమూడి, లేమల్లె తదితర గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
  • మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ లను ఘనంగా స్వాగతించిన స్థానికులు
  • తమ గ్రామాలను ఎంపిక చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్థులు

ఏపీ రాజధాని అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఊపందుకుంటోంది. ఈరోజు పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు మండలం కర్లపూడి - లేమల్లె గ్రామాల్లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు.


స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి నారాయణ రైతుల నుంచి అంగీకార పత్రాలు స్వీకరించారు. తమ వద్దకు వచ్చిన మంత్రి, ఎమ్మెల్యేలకు స్థానికులు ఘనస్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో స్వాగతించారు. తమ గ్రామాలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.


ఈ రెండో దశలో మొత్తం 7 గ్రామాల్లో భూసమీకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో పల్నాడు జిల్లా అమరావతి మండలంలో వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె... గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాలు ఉన్నాయి.


ఇప్పటివరకు 4 గ్రామాల్లో ప్రక్రియ ప్రారంభమైంది (కర్లపూడి-లేమల్లెతో సహా). ఈ భూములను అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా నగరం (ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ), స్మార్ట్ పరిశ్రమలు, రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ వంటి పెద్ద ప్రాజెక్టుల కోసం ఉపయోగించనున్నట్టు తెలుస్తోంది. మొదటి దశలో 34,000 ఎకరాలు ఇప్పటికే పూల్ అయ్యాయి, ఇప్పుడు ఇంకా విస్తరణతో అమరావతి మరింత పెద్ద నగరంగా మారనుంది.



More Telugu News