పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ రద్దీ.. వీడియో ఇదిగో!
- సంక్రాంతి పండుగ నేపథ్యంలో పల్లెబాట పట్టిన పట్నం వాసులు
- నిన్న ఒక్క రోజే ఏపీకి 60 వేల వాహనాలు
- ఆదివారం కావడంతో ఈరోజు మరింత రద్దీ
మరోవైపు రోడ్డు నిర్మాణ పనులతో ఏపీలోని నందిగామ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయింది. సొంత వాహనాలలో జనం రోడ్డెక్కడంతో హైదరాబాద్- విజయవాడ రహదారిపై భారీ రద్దీ నెలకొంది. వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి. రద్దీ కారణంగా ఏపీ వైపు వెళ్లే వాహనాల కోసం ఎక్కువ టోల్‌బూత్‌లు తెరిచారు.