Dhruv Jurel: గాయంతో పంత్ ఔట్.. అత‌డి స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చింది ఎవ‌రంటే..?

Dhruv Jurel named Pants replacement for ODI series against NZ
  • న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు రిషబ్ పంత్ దూరం
  • ప్రాక్టీస్ సెషన్‌లో పక్కటెముకల కండరాల గాయం
  • పంత్ స్థానంలో జట్టులోకి యువ కీపర్ ధ్రువ్ జురెల్
  • విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ అద్భుత ఫామ్
  • బెంగళూరులో పంత్ రిహాబిలిటేషన్
న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ గాయం కారణంగా సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు బీసీసీఐ తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.

వడోదరలోని బీసీఏ స్టేడియంలో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ గాయ‌ప‌డ్డాడు. నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా పంత్ తన కుడివైపు పక్కటెముకల ప్రాంతంలో తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడ్డాడు. వెంటనే అతడిని స్కానింగ్‌కు తరలించగా, కండరాల గాయం (Oblique Muscle Tear) అయినట్లు నిర్ధారణ అయింది. దీంతో అతడిని సిరీస్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ వైద్య బృందం స్పష్టం చేసింది.

పంత్ స్థానంలో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ వెంటనే జట్టుతో కలిశాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో జురెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతను, ఏడు మ్యాచ్‌లలో 90కి పైగా సగటుతో 558 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

గాయపడిన పంత్ కొద్దిరోజులు విశ్రాంతి తీసుకుని, అనంతరం రిహాబిలిటేషన్ కోసం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు వెళ్లనున్నాడు. ఇటీవల మరో గాయం నుంచి కోలుకున్న పంత్ మళ్లీ గాయపడటం గమనార్హం.
Dhruv Jurel
Rishabh Pant
India vs New Zealand
Vijay Hazare Trophy
BCCI
Cricket Injury
Wicket Keeper
Indian Cricket Team
Oblique Muscle Tear
BCA Stadium

More Telugu News