Telangana Weather: తెలంగాణను వణికిస్తున్న చలి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Cold wave grips Telangana as temperatures plummet
  • తెలంగాణ వ్యాప్తంగా భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు
  • 12 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
  • రాష్ట్రానికి మరో మూడు రోజుల పాటు చలి హెచ్చరిక జారీ
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.9 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతోనే రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని కారణంగా రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Telangana Weather
Telangana cold weather
Hyderabad weather
Telangana temperature
India weather forecast
cold wave
weather update
winter season
lowest temperature

More Telugu News