Mary Kom: నా విజయాల వల్ల ఏం ప్రయోజనం?.. విడాకులపై తొలిసారి పెదవి విప్పిన మేరీ కోమ్

Mary Kom Opens Up About Divorce Financial Struggles
  • భర్త ఓన్లర్ నుంచి రెండేళ్ల క్రితమే విడిపోయినట్లు చెప్పిన మేరీకోమ్
  • తన కష్టార్జితాన్ని భర్త దుర్వినియోగం చేశాడని ఆరోపణ
  • ఆస్తులను తన పేరిట మార్చుకుని అప్పుల పాలు చేశారని ఆవేదన
  • సోషల్ మీడియాలో తనను 'దురాశపరురాలు'గా చిత్రీకరించడంపై తీవ్ర అసహనం
ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ తన జీవితంలోని ‘చీకటి రోజుల’పై మౌనం వీడారు. తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపాలని కోరుతూ, తన విడాకులు, ఆర్థిక కష్టాల వెనుక ఉన్న అసలు కారణాలను బయటపెట్టారు.

తన భర్త ఓన్లర్ నుంచి 2025లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు మేరీకోమ్ తెలిపారు. "నేను రింగులో పోటీ పడుతున్నంత కాలం ఆర్థిక విషయాల గురించి పట్టించుకోలేదు. కానీ 2022లో గాయపడి మంచాన పడినప్పుడు, నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేస్తున్నాడని తెలిసింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఆస్తులను తన పేరిట మార్చుకోవడం, తన సంతకాన్ని వాడి అప్పులు చేయడం వంటి పనుల వల్ల తాను దివాలా తీసే స్థితికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో తన క్యారెక్టర్‌పై జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతూ.. "నన్ను దురాశపరురాలిగా పిలుస్తున్నారు. కానీ నేను అనుభవించిన నరకం ఎవరికీ తెలియదు. కేవలం మా ఇద్దరి మధ్య జరిగిన విషయాలను తప్పుగా లీక్ చేసి నన్ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారు" అని మేరీకోమ్ వాపోయారు. అయితే ఈ ఆరోపణలను ఆమె మాజీ భర్త ఓన్లర్ తోసిపుచ్చారు.

ప్రస్తుతం ఫరీదాబాద్‌లో ఉంటున్న మేరీ కోమ్, నలుగురు పిల్లల బాధ్యత తనపైనే ఉందని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా తనపైనే ఆధారపడి ఉన్నారని, అందుకే బాధపడుతూ కూర్చునే సమయం తనకు లేదని అన్నారు. ప్రస్తుతం ఎండార్స్‌మెంట్లు, కమర్షియల్ ఈవెంట్ల ద్వారా తన ఆర్థిక పరిస్థితిని తిరిగి నిర్మించుకుంటున్నట్లు ఆమె తెలిపారు. "నా జీవితం ఒక సుదీర్ఘమైన బాక్సింగ్ మ్యాచ్ లాంటిది.. పోరాడుతూనే ఉంటాను" అని మేరీ కోమ్ ధీమా వ్యక్తం చేశారు.
Mary Kom
Mary Kom divorce
MC Mary Kom
Indian boxer
Onler Kom
Mary Kom financial issues
boxing champion
Indian sports
Manipur
Mary Kom biography

More Telugu News