Virat Kohli: ఫ్యాన్స్ మధ్యలో కోహ్లీ డూప్.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ అయిన బుడ్డోడి ఫొటో!

Virat Kohli Gives Autograph To His Childhood Look Alike Fans Left In Shock
  • వడోదరలో ఆటోగ్రాఫ్ ఇస్తుండగా విరాట్ కోహ్లీకి ఎదురైన ఆసక్తికర ఘటన
  • అభిమానుల్లో ఒక బాలుడు అచ్చం చిన్నప్పటి కోహ్లీలాగే ఉండటం గుర్తింపు
  • 'మినీ కోహ్లీ' అంటూ సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తాజాగా అతడి అభిమానుల్లో ఒక బాలుడి ఫొటో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఆ చిన్నారి అచ్చం చిన్నప్పటి విరాట్ కోహ్లీలాగే ఉండటమే దీనికి కారణం. ఈ ఆసక్తికర ఘటన వడోదరలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. న్యూజిలాండ్‌తో తొలి వన్డే మ్యాచ్ కోసం భారత జట్టు వడోదరకు చేరుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ కొంతమంది చిన్నారులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తున్నాడు. ఆ సమయంలో తీసిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెట్టింట‌ వైరల్ అయ్యాయి. ఆటోగ్రాఫ్ కోసం ఎదురుచూస్తున్న పిల్లల గుంపులో ఒక బాలుడు అచ్చం కోహ్లీ చిన్నప్పటి రూపానికి జిరాక్స్ కాపీలా కనిపించాడు.

ఈ పోలికను గమనించిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ పోస్టులు పెట్టడం ప్రారంభించారు. 'మినీ కోహ్లీ దొరికేశాడు' అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కోహ్లీ, ఆ చిన్నారి ఫొటోలను పక్కపక్కన పెట్టి పోలుస్తూ షేర్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు కోహ్లీ మాత్రం ఇవేమీ గమనించకుండా చిరునవ్వులు చిందిస్తూ తన అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడంలో నిమగ్నమయ్యాడు. ఇక‌, ప్రస్తుతం కోహ్లీ, రోహిత్ శర్మ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతుండటం తెలిసిందే. దీంతో ఇవాళ్టి నుంచి కివీస్‌తో జ‌రిగే సిరీస్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Virat Kohli
Virat Kohli fan
Virat Kohli lookalike
India vs New Zealand
Cricket
Vadodara
Viral photo
Mini Kohli
Rohit Sharma
ODI series

More Telugu News