సోమ్‌నాథ్ ఆలయంలో కళ్లు చెదిరేలా డ్రోన్ షో... తిలకించిన ప్రధాని మోదీ

  • సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
  • ఆసక్తిగా డ్రోన్ షోను తిలకించిన ప్రధాని
  • ప్రతి ఒక్కరినీ మంత్రముగ్దులను చేసిందన్న వ్యాఖ్య
గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి, ఓంకార మంత్ర జపంలో పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో, బాణసంచా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రధాని మోదీ డ్రోన్ షోను ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా ఆయన 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ, సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ సందర్భంగా సోమనాథ్ దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన అద్భుతమైన డ్రోన్ ప్రదర్శనను వీక్షించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భారతదేశపు ప్రాచీన ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఆధునిక సాంకేతికత సమన్వయమై ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేసిందని ఆయన అన్నారు. సోమనాథ్ పవిత్ర భూమి నుంచి వెలువడిన ఈ కాంతి పుంజం ప్రపంచమంతటికీ భారత సాంస్కృతిక శక్తిని చాటుతోందని ప్రధాని మోదీ అభివర్ణించారు. 


More Telugu News