Parthasarathi: రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంటే వైసీపీ పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తోంది: మంత్రి పార్థసారథి
- గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రాజెక్టులు నేడు పూర్తి కావొస్తున్నాయని వెల్లడి
- రాజధాని లేని రాష్ట్రం నిందను పోగొట్టి, ప్రజలు మెచ్చే రాజధానిని నిర్మిస్తున్నామన్న మంత్రి
- తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని అందరికీ తెలిసిందన్న మంత్రి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఆ విషయాన్ని తట్టుకోలేక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిగట్టుకుని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు నేడు పూర్తికావస్తున్నాయని అన్నారు. రాజధాని లేని రాష్ట్రం అనే నిందను పోగొట్టి, ప్రజలందరూ మెచ్చే రాజధానిని నిర్మిస్తుంటే ప్రజల దృష్టిని మరల్చడానికి సాక్షి టీవీ, పేపర్లను వాడుకుని వైసీపీ నాయకులు సిగ్గులేకుండా అబద్ధాలు చెబుతున్నారని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యి కల్తీ జరిగిందనే విషయం చిన్నా పెద్దా అందరికీ తెలిసిపోయిందని అన్నారు.
పామాయిల్, కెమికల్స్ వాడి నెయ్యిని అపవిత్రం చేసిన విషయం సిట్ (సిట్), సీబీఐ విచారణల్లో తేలిందని అన్నారు. ఇంత పాపం చేసినా భయం లేకుండా వైసీపీ నేతలు ఎదురుదాడి చేయడం దారుణమని మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డికి, వారి ముఖ్య నాయకులకు హిందూ సంప్రదాయాల మీద గానీ, దేవుడి మీద గానీ కనీస భక్తి లేకపోవడమే దీనికి కారణమని ఆరోపించారు. మీ దగ్గర నిజం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ చేశారు.
వారి మాటల్లో నిజం లేదు కాబట్టే అసెంబ్లీకి రాకుండా తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని 'ఎక్స్' ద్వారా, సొంత మీడియా ద్వారా విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మీరు రేపు ప్రజల్లోకి వెళ్లి పోటీ చేసే పరిస్థితి కూడా లేదని, కేవలం తాడేపల్లి కుర్చీల కోసమే మీరు కొట్టుకుంటారని విమర్శించారు. నెయ్యి సేకరణపై కూడా వైసీపీ నేతలు అజ్ఞానంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నందిని డైరీకి 40 లక్షల లీటర్ల ఆర్డర్ ఇచ్చామని, మొత్తం నెయ్యి అవసరంలో 62 శాతం నందిని, మదర్ డైరీల నుంచే సేకరిస్తున్నామని అన్నారు. మిగిలిన టెండర్లు ఇందాపూర్, సంఘం డైరీలకు దక్కాయని వెల్లడించారు. ఎన్డీడీబీ, ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ ఉన్న ల్యాబొరేటరీల పరీక్షల తర్వాతే నెయ్యిని అనుమతిస్తున్నామని అన్నారు. పదేళ్ల క్రితం ఉన్న ధరలకే ఇప్పుడు కూడా నెయ్యి రావాలని కోరడం మీ తెలివితక్కువతనానికి నిదర్శనమని విమర్శించారు. మీ భారతీ సిమెంట్ వంటి ఇతర వస్తువుల ధరలు పెరిగినట్టే, నెయ్యి ధరలు కూడా పెరుగుతాయని తెలియదా? అని ప్రశ్నించారు.
"కల్తీ నెయ్యి తినడం వల్ల మీకు బుద్ధిమాంద్యం వచ్చిందేమో అనిపిస్తోంది. భక్తుల నమ్మకాన్ని కాపాడటం కోసం భవిష్యత్తులో ఎటువంటి కల్తీకి తావులేకుండా టీటీడీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన 'స్టేట్ ఆఫ్ ఆర్ట్' ల్యాబొరేటరీని ఏర్పాటు చేశాం. ఇప్పుడు ప్రతి ట్రక్కు నెయ్యిని క్షుణ్ణంగా పరీక్షించిన తర్వాతే లడ్డూ తయారీకి అనుమతిస్తున్నాం. భక్తుల నమ్మకాన్ని కాపాడటమే మా ప్రభుత్వ లక్ష్యం. రాజశేఖర్ రెడ్డి గారు ఏడుకొండలను దివ్యక్షేత్రంగా చేశారని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలు అసలు విషయాన్ని దాచేశారు. 2005లో జీవో నెంబర్ 338 ద్వారా తిరుమల పరిధిని కేవలం రెండు కొండలకే పరిమితం చేయాలని చూసింది వాస్తవం కాదా?" అని నిలదీశారు.
అప్పట్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హిందూ సంఘాలు, తెలుగుదేశం పార్టీ పోరాటం చేయడం వల్లే, దిగివచ్చిన నాటి ప్రభుత్వం 2007లో మళ్ళీ ఏడుకొండలను కలుపుతూ జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ చరిత్రను ప్రజలు మర్చిపోలేదని అన్నారు. హెరిటేజ్ గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదని అన్నారు. హెరిటేజ్ సంస్థ నాణ్యత విషయంలో ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి తన జీవితంలో జరిగిన ఒక సంఘటనే ఉదాహరణ అన్నారు.
గతంలో తనకు పాలు ప్యాకింగ్ చేసే 'ఫిలిం' ఫ్యాక్టరీ ఉండేదని, తాను అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నప్పటికీ, తన కంపెనీ నాణ్యతను చూసి హెరిటేజ్ వారు ఆర్డర్లు ఇచ్చారని వెల్లడించారు. కానీ ఒకరోజు వారి అధికారి మా ఫ్యాక్టరీకి వచ్చినప్పుడు అక్కడ కొన్ని దోమలు, పురుగులు ఉండటం గమనించి వెంటనే ఆర్డర్లు రద్దు చేశారని అన్నారు. క్వాలిటీ విషయంలో కొంచెం తేడా వచ్చినా వారు రాజీపడరని తెలిపారు.
తాను ప్రతిపక్షంలో ఉన్నానని కాదని, క్వాలిటీ లేదని ఆర్డర్ తీసేశారని అన్నారు. అదీ ఆ సంస్థ పాటించే నిబద్ధత అని వెల్లడించారు. ఇందాపూర్ డైరీపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఫెన్స్ ఆయుధాలు తయారు చేసే సంస్థలైనా, ఎయిర్ బస్ అయినా, బీహెచ్ఎల్ అయినా అన్నీ తమ సొంత కంపెనీలోనే తయారు చేయవని పేర్కొన్నారు. వివిధ కంపెనీల నుండి కాంపోనెంట్స్ తీసుకుని అసెంబుల్ చేస్తాయని తెలిపారు. అలాగే హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ నుండి చీజ్ కొంటే తప్పేమిటని ప్రశ్నించారు.
"ఇందాపూర్ అనేది దేశంలోనే అతిపెద్ద డైరీ. ఇది అమూల్, బ్రిటానియా, మదర్ డైరీ వంటి దిగ్గజాలకు ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. అటువంటి సంస్థకు అపవిత్రత ఆపాదిస్తారా? అటువంటి ప్రతిష్ఠాత్మక సంస్థపై కూడా బురద చల్లడం వైసీపీ నాయకుల కుసంస్కారానికి నిదర్శనం.
భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు పట్టు పంచెలు కట్టి, నామాలు పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు. గతంలో ఆయన 'ఏడుకొండల వాడు కేవలం ఒక నల్లరాయి' అని, ఆ రాయిని చెప్పుతో కొడితే ఏమవుతుందని అన్న మాటలు సోషల్ మీడియాలో సాక్ష్యాలతో ఉన్నాయి. ఆర్ఎస్‌యూ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన ప్రచారం చేసిన నాస్తికత్వాన్ని ప్రజలు గుర్తించారు. భగవంతుడిపై నమ్మకం లేని ఇలాంటి వ్యక్తుల చేతుల్లో తిరుమల పవిత్రత ఎలా కాపాడబడుతుందని భావించారు? చేసిన పాపానికి భగవంతుడి దగ్గర క్షమాపణ కోరాల్సింది పోయి, ఎదురుదాడి చేయడం మీ అహంకారానికి నిదర్శనం. ఇప్పటికైనా అబద్ధాలు మానుకొని, హిందూ మనోభావాలను గౌరవించడం నేర్చుకోండి" అని అన్నారు.
ఆనాడు పర్చేస్ కమిటీలో ఉన్నప్పుడు మేము చెప్పింది ఒక్కటేనని, పోటీని పెంచాలని, ఆవు నెయ్యి సరఫరా చేసే వారిని ఎక్కువ మందిని రప్పించండని సూచించామని అన్నారు. అంతే కానీ, కల్తీ నెయ్యిని, పామాయిల్ నెయ్యిని కొనమని మేము ఎప్పుడూ చెప్పలేదని తెలిపారు. మంచి మాటల్లో నుంచి కూడా చెడును వెతకడం వైసీపీ నేతలకే చెల్లిందని అన్నారు.
ఆవు నెయ్యి ముసుగులో పామాయిల్, కెమికల్స్ వాడి భక్తుల మనోభావాలతో ఆడుకున్నది మీరు కాదా అని వైసీపీ నేతలను ఉద్దేశించి ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి వేరే మతాన్ని నమ్మవచ్చు, అది ఆయన ఇష్టమని స్పష్టం చేశారు. భారతీయ సంస్కృతి ప్రకారం ప్రతి మతాన్ని మనం గౌరవిస్తామని, కానీ ఇతర మతస్తుల నమ్మకాలను, హిందూ దేవుళ్ల పవిత్రతను అగౌరవపరచడం సరైంది కాదని హితవు పలికారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ప్రవర్తించాలని సూచించారు.