'జన నాయగన్'కు సెన్సార్ దెబ్బ... సంక్రాంతికి విజయ్ మరో సినిమా రీ-రిలీజ్
- సెన్సార్ సమస్య కారణంగా వాయిదాపడిన 'జన నాయగన్'
- 2016లో విజయవంతమైన యాక్షన్ థ్రిల్లర్ 'తేరి' విడుదల
- జనవరి 15న చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడి
తమిళ సినీ నటుడు విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం సెన్సార్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇది ఆయన చివరి సినిమా కావడం, విడుదల వాయిదా పడటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, సంక్రాంతి పండుగకు విజయ్ మరో చిత్రంతో అభిమానులను అలరించనున్నారు.
అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'తేరి' 2016లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కలైపులి ఎస్. థాను ప్రకటించారు. పండుగ సందర్భంగా జనవరి 15న తమిళనాడులో ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 'జన నాయగన్' విడుదల నిరాశపరిచినప్పటికీ, 'తేరి'తో విజయ్ పండుగకు సిద్ధం కావడం అభిమానుల్లో సంతోషాన్ని నింపింది.
కాగా, 'తేరి' చిత్రం తెలుగులో 'పోలీసోడు' పేరుతో వచ్చింది. ఇందులో విజయ్ సరసన సమంత కథానాయికగా నటించింది.