RO-KO: 'రో-కో' రీలోడెడ్‌.. ఆస‌క్తిక‌ర వీడియో షేర్ చేసిన బీసీసీఐ

BCCI shares Rohit Sharma Virat Kohli practice video
  • రేపటి నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా వన్డే సిరీస్
  • వడోదరాలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేసిన భారత ఆటగాళ్లు
  • ప్రాక్టీస్ సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోహిత్, కోహ్లీ
  • నెట్స్‌లో భారీ షాట్లతో అలరించిన సీనియర్ ద్వయం
న్యూజిలాండ్‌తో రేపటి నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌ కోసం టీమిండియా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా వడోదరాలో భారత ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

బ్యాటింగ్, ఫీల్డింగ్, క్యాచింగ్ విభాగాల్లో ఈ ఇద్దరు సీనియర్లు తీవ్రంగా శ్రమించారు. నెట్స్‌లో భారీ షాట్లు ఆడుతూ చెమటోడ్చారు. రోహిత్, కోహ్లీ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితమైన ఈ ద్వయం, ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో అద్భుతంగా రాణించింది. కివీస్‌తో సిరీస్‌లోనూ అదే జోరును కొనసాగించి జట్టుకు విజయాలు అందించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
RO-KO
Rohit Sharma
Virat Kohli
India vs New Zealand
ODI Series
BCCI
Cricket Practice
Team India
Vadodara
Cricket

More Telugu News