Prabhas: ఓడిశాలో 'రాజాసాబ్' థియేటర్ లో మంటలు
- ఒడిశాలోని రాయగడలో ప్రమాదం
- థియేటర్‌లో టపాసులు పేల్చిన అభిమానులు
- పేపర్లపై నిప్పురవ్వలు పడి చెలరేగిన మంటలు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'ది రాజాసాబ్' సినిమా నిన్న రిలీజ్ అయిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఒడిశాలోని రాయగడలో జరిగిన ఒక సంఘటన మాత్రం భయపెట్టింది.
అక్కడి ఒక థియేటర్‌లో సినిమా ప్రదర్శన జరుగుతుండగా, ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ వచ్చినప్పుడు అభిమానులు రెచ్చిపోయారు. కొందరు థియేటర్ లోపలే టపాసులు కాల్చారు. ఆ నిప్పురవ్వలు స్క్రీన్ ముందు ఉన్న పేపర్ ముక్కలపై పడి ఒక్కసారిగా చిన్న మంటలు చెలరేగాయి.
అది గమనించిన థియేటర్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై మంటలను త్వరగా ఆర్పేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సేఫ్ గా బయటపడ్డారు. మంటలు స్క్రీన్ కి లేదా సీట్లకు అంటుకుని ఉంటే పెను ప్రమాదం సంభవించేది. మరోవైపు, అభిమానుల అత్యుత్సాహంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. థియేటర్ లోపల టపాసులు పేల్చడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.