Donald Trump: కరీబియన్ సముద్రంలో మరో చమురు నౌకను అధీనంలోకి తీసుకున్న అమెరికా

US seizes another oil tanker in Caribbean Sea
  • కరేబియన్‌లో మరో వెనెజువెలా చమురు నౌక స్వాధీనం చేసుకున్న అమెరికా సైన్యం
  • యూఎస్‌ మెరైన్‌ అండ్ నేవీ సహకారంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు వెల్లడి 
  • సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన సైన్యం
వెనెజువెలా నుండి రాకపోకలు సాగించే నౌకలపై ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్న ట్రంప్ యంత్రాంగం మరో కీలక చర్యకు దిగింది. కరేబియన్ సముద్రంలో 'ఒలినా' అనే చమురు నౌకను స్వాధీనం చేసుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. యూఎస్ మెరైన్ అండ్ నేవీ సహకారంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టినట్లు అమెరికా సదరన్ కమాండ్ వెల్లడించింది. నేర కార్యకలాపాలకు పాల్పడే వారికి సురక్షితమైన ప్రదేశం లేదని స్పష్టం చేసింది.

హెలికాప్టర్ల సహాయంతో అమెరికా బలగాలు నౌకపైకి దిగి విస్తృతంగా సోదాలు నిర్వహించాయని సైన్యం తెలిపింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇదిలా ఉండగా, వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత అక్కడి చమురు వనరులపై తమకే నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెనెజువెలాతో సంబంధం ఉన్న నౌకలపై అమెరికా చర్యలు తీవ్రతరం చేసింది. తాజాగా ఐదో చమురు నౌకను స్వాధీనం చేసుకుంది. 
Donald Trump
Venezuela
US Navy
Oil Tanker
Caribbean Sea
Olina
America
Nicolas Maduro
US Southern Command

More Telugu News