మోదీ ఫోన్ చేయలేదన్న అమెరికా వ్యాఖ్యలపై స్పందించిన భారత్
- మోదీ, ట్రంప్ ఎనిమిదిసార్లు ఫోన్‌లో సంభాషించుకున్నారన్న భారత్
- పరస్పర ప్రయోజనం చేకూర్చే వాణిజ్య ఒప్పందం కోసం ఇరుపక్షాలు సంప్రదింపులుజరిపాయని వెల్లడి
- పలుమార్లు ఒప్పందానికి దగ్గరగా వచ్చామన్న భారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్ చేయకపోవడం వల్లే భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరలేదన్న అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. లుట్నిక్ వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. ఇరుదేశాలకు సంబంధించి వివిధ అంశాల్లో గత సంవత్సరం ప్రధాని మోదీ, ట్రంప్ ఎనిమిదిసార్లు ఫోన్‌లో సంభాషించుకున్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అదనపు ఆంక్షలు విధించే బిల్లుపై తమకు అవగాహన ఉందని, ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపింది. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను చూశామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు గత సంవత్సరం ఫిబ్రవరి 13 నాటికే ఇరుదేశాలు కట్టుబడి ఉన్నాయని అన్నారు.
నాటి నుంచి పరస్పర ప్రయోజనం చేకూరే వాణిజ్య ఒప్పందం కోసం ఇరుపక్షాలు పలుమార్లు సంప్రదింపులు జరిపాయని తెలిపారు. వీటికి సంబంధించి అమెరికా మంత్రి వ్యాఖ్యల్లో స్పష్టత కనిపించలేదని అన్నారు. పలుమార్లు ఒప్పందానికి దగ్గరగా వచ్చామని, ఇప్పటికీ దీనిపై ముందుకు వెళ్లడానికి ఆసక్తిగా ఉన్నామని అన్నారు.