హీరో నవదీప్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

Navdeep Gets Major Relief in Telangana High Court
  • డ్రగ్స్ కేసులో నవదీప్ కు భారీ ఊరట
  • నవదీప్ వద్ద డ్రగ్స్ లభించలేదనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన న్యాయవాది
  • ఆధారాలు లేకుండా కేసును కొనసాగించలేమన్న హైకోర్టు

డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్‌కు పెద్ద ఊరట లభించింది. ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గుడిమల్కాపూర్‌లో నమోదైన ఈ కేసులో నవదీప్ వద్ద ఎలాంటి మత్తుపదార్థాలు దొరకలేదన్న అంశాన్ని కోర్టు స్పష్టంగా గుర్తించింది.


నవదీప్ తరఫున వాదనలు వినిపించిన అడ్వొకేట్ వెంకట సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ఈ కేసులో నవదీప్ పేరు కేవలం ఎఫ్ఐఆర్ లో మాత్రమే ఉందని, సంఘటన జరిగిన ప్రదేశంలో ఆయన వద్ద డ్రగ్స్ ఏవీ లభించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పాట్‌లో స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో నవదీప్‌కు సంబంధించిన ఆధారాలు లేవని వివరించారు.


ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. సరైన ఆధారాలు లేకుండా కేసు కొనసాగించడం సరికాదని పేర్కొంది. నవదీప్ వద్ద డ్రగ్స్ లభించనందున, ఆయనపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో నవదీప్‌కు చట్టపరంగా పెద్ద ఊరట లభించినట్టయింది.

Go Back to Shorts
Navdeep
Navdeep drugs case
Telangana High Court
Drugs case dismissed
Gudimalkapur
Advocate Venkata Siddhartha
Tollywood
Hyderabad drugs case

More Telugu News