Harry Brook: మద్యం మత్తులో గొడవ.. ఇంగ్లండ్ క్రికెటర్‌ బ్రూక్ పై చేయి చేసుకున్న బౌన్సర్... ఆలస్యంగా వెలుగులోకి!

Harry Brook Involved in Night Club Altercation
  • గత సంవత్సరం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి
  • న్యూజిలాండ్‌తో మూడవ వన్డేకు ముందు రోజు ఘటన
  • మద్యం సేవించాడని నైట్ క్లబ్ వద్ద బ్రూక్‌ను ఆపేసిన బౌన్సర్
  • ఆ తర్వాత క్షమాపణలు చెప్పిన హ్యారీ బ్రూక్
ఇంగ్లండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ మద్యం మత్తులో ఓ నైట్ క్లబ్ వద్ద గొడవకు దిగాడు. ఈ క్రమంలో అక్కడి బౌన్సర్ అతడిపై చేయి చేసుకున్నాడు. గతేడాది జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బౌన్సర్‌తో జరిగిన వివాదానికి సంబంధించి హ్యారీ బ్రూక్ ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు.

గత సంవత్సరం నవంబర్ 1న న్యూజిలాండ్‌తో మూడవ వన్డేకు ముందు రోజు ఈ సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి హ్యారీ బ్రూక్ తన సహచర క్రికెటర్లు జాకబ్ బెతెల్, గస్ అట్కిన్సన్‌లతో కలిసి వెల్లింగ్టన్‌లోని ఓ నైట్ క్లబ్‌కు వెళ్ళాడు. మద్యం సేవించి ఉన్నాడని అనుమానించిన బౌన్సర్, బ్రూక్‌ను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం జరిగి బౌన్సర్ క్రికెటర్‌పై చేయి చేసుకున్నాడు.

ఈ వివాదంపై హ్యారీ బ్రూక్ స్వయంగా టీమ్ మేనేజ్‌మెంట్‌కు వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు బ్రూక్‌కు తుది హెచ్చరిక జారీ చేయడంతో పాటు దాదాపు 30,000 పౌండ్ల జరిమానా విధించింది. అనంతరం బ్రూక్ తన ప్రవర్తనకు క్షమాపణలు చెప్పాడు.

తన చర్యలు తప్పని అంగీకరిస్తున్నానని, ఇది తనకు, జట్టుకు ఇబ్బంది కలిగించిందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌కు ప్రాతినిధ్యం వహించడం గొప్ప వరమని తెలిపాడు. తన సహచరులు, కోచ్‌లు, మద్దతుదారులను నిరాశపరిచినందుకు చింతిస్తున్నానని ఒక ప్రకటనలో తెలియజేశాడు.
Harry Brook
Harry Brook controversy
England cricketer
night club brawl
bouncer assault
cricket news

More Telugu News