Donald Trump: భారత మార్కెట్లపై ట్రంప్ ఎఫెక్ట్.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి

Donald Trump Effect on Indian Markets 8 Lakh Crore Rupees Lost
  • 780 పాయింట్లతో నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్
  • 26,000 పాయింట్ల దిగువకు చేరుకున్న నిఫ్టీ
  • 500 శాతం సుంకాలు విధించేందుకు సిద్దమైన ట్రంప్ ప్రభుత్వం
దేశీయ స్టాక్ మార్కెట్‌లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సూచీలు వరుసగా నాలుగో సెషన్‌లోనూ నష్టాలను చవిచూశాయి. భారత్, అమెరికా మధ్య నెలకొన్న వాణిజ్య సందిగ్ధత సూచీలపై ఒత్తిడి పెంచింది. రష్యాకు చెక్ పెట్టేందుకు భారత్‌ తదితర దేశాలపై 500 శాతం సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుకు ట్రంప్ ప్రభుత్వం సిద్ధం కావడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది.

అదే సమయంలో విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపడం, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు మార్కెట్ నష్టాలకు మరింత ఆజ్యం పోశాయి. సెన్సెక్స్ ఒక దశలో 800 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరకి 780 పాయింట్ల నష్టంతో 84,181 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 రోజుల కనిష్ఠానికి చేరుకుని, 26,000 దిగువన ముగిసింది.

మార్కెట్లు భారీగా నష్టపోవడంతో పెట్టుబడిదారుల సంపదగా భావించే బీఎస్ఈలో కంపెనీల మర్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరైంది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.480 లక్షల కోట్ల నుంచి రూ.472 లక్షల కోట్లకు తగ్గింది.

సెన్సెక్స్ ఉదయం 84,778 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. రోజంతా అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోనే కొనసాగుతూ, 84,180 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 264 పాయింట్లు నష్టపోయి 25,876 పాయింట్ల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, బీఎస్ఎన్ఎల్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.
Donald Trump
Indian stock market
stock market crash
sensex
nifty
indian economy
russia oil imports

More Telugu News