పోలీసులతో వచ్చి మమతా బెనర్జీ కీలక డాక్యుమెంట్లు తీసుకువెళ్లారు: ఈడీ సంచలన ఆరోపణలు
- ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ సోదాలు
- సోదాల సమయంలో ప్రతీక్ జైన్ నివాసానికి వచ్చిన మమతా బెనర్జీ
- మమతా పోలీసు అధికారులతో వచ్చి కీలక డాక్యుమెంట్లు తీసుకెళ్లారని ఈడీ ఆరోపణ
బొగ్గు అక్రమ రవాణా ద్వారా ఆదాయం పొందిన వ్యక్తులకు సంబంధించి కోల్‌కతాలో ఈ సోదాలు చేపట్టినట్లు ఈడీ వెల్లడించింది. హవాలా మనీతో ఐ-ప్యాక్‌కు సంబంధం ఉందని, ఇందులో ఒక వ్యక్తికి, ఈ సంస్థకు మధ్య కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని తెలిపింది.
పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐ-ప్యాక్ డైరెక్టర్ నివాసానికి వచ్చారని తెలిపారు. అప్పటి వరకు సోదాలు శాంతియుతంగా జరిగాయని ఈడీ వెల్లడించింది. సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఏ రాజకీయ పార్టీని, ఏ ఎన్నికను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు చేపట్టలేదని స్పష్టం చేసింది.