Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ పేరిట నకిలీ పెట్టుబడి వీడియోలు.. స్పందించిన ఫ్యాక్ట్ చెక్ విభాగం

Nirmala Sitharaman Fake Investment Videos Fact Check by PIB
  • ఆర్థిక మంత్రి పేరిట వైరల్ అవుతున్న పెట్టుబడి వీడియోలు నకిలీవని వెల్లడి
  • ఎలాంటి పెట్టుబడి పథకాలను ప్రోత్సహించడం లేదని స్పష్టీకరణ
  • నిజానిజాలు ధృవీకరించుకోవాలని సూచన
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో కొన్ని నకిలీ పెట్టుబడి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో యొక్క ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. నిర్మలా సీతారామన్ కొన్ని పెట్టుబడి పథకాలకు ప్రచారం చేస్తున్నట్లుగా వైరల్ అవుతున్న వీడియోలు వాస్తవం కాదని తెలిపింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలు నకిలీవని, కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్థిక మంత్రి కానీ ఎలాంటి పెట్టుబడి పథకాలను ప్రోత్సహించడం లేదని పేర్కొంది. పెట్టుబడులకు సంబంధించిన సమాచారం కోసం అధికారిక పోర్టల్స్, ఆర్బీఐ, సెబీ వంటి నియంత్రణ సంస్థల ద్వారా ధృవీకరించుకోవాలని సూచించింది.

నిర్మలా సీతారామన్ పెట్టుబడి సూచనలు చేస్తున్నట్లుగా కనిపించే లింక్స్‌ను క్లిక్ చేసే ముందు వాటిని పరిశీలించాలని సూచించింది. ఎవరితోనూ వ్యక్తిగత వివరాలు, ఓటీపీ, బ్యాంకింగ్‌‌ సంబంధిత సమాచారాన్ని పంచుకోవద్దని ప్రజలను హెచ్చరించింది.
Nirmala Sitharaman
Nirmala Sitharaman fake videos
investment videos
PIB Fact Check
fake investment schemes

More Telugu News